వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో అగ్నివీర్ బ్యాచ్ (01/26) పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 116 మంది మహిళలతో కలుపుకుని మొత్తం 3,011 మంది అగ్నివీరులు, 265 మంది ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్‌లు విజయవంతంగా తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు.
భారీ వర్షం కారణంగా పరేడ్ దాదాపు గంటపాటు నిలిచిపోయినా.. అనంతరం రెట్టింపు ఉత్సాహంతో కొనసాగింది. వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఈ పరేడ్‌ను లాంఛనంగా సమీక్షించారు.
Comments
Loading comments...

