Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 4:17 PM మహబూబ్‌నగర్తెలంగాణ
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు - Udayam
గట్టు మండలం బల్గెర, తారాపురంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, సుమారు 2 వేల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇళ్లు రానివారికి రెండో విడతలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...