Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లతో మరో నాటకం: బీజేపీ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 22, 2026 11:09 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లతో మరో నాటకం: బీజేపీ - Udayam
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల' పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. కేవలం కొన్ని ఫ్లాట్లకే నోటిఫికేషన్ ఇచ్చి, ఈఎండీ రూపంలో పేదల నుంచి రూ.1,000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు. గతంలో పూర్తయిన ఇళ్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలని, పిఎంఏవై నిధులతో ప్రచారం చేసుకోవడం తగదని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...