వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదుసార్లు ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అక్టోబర్ 3న భారత ఫుట్‌బాల్ జట్టుతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) వెల్లడించింది.
ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం బ్రెజిల్ సీనియర్ పురుషుల జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్, బ్రెజిల్ సీనియర్ జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
Comments
Loading comments...
