వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. టాయిలెట్ అద్దంపై ‘బూమ్ - 1.50 PM’ అని రాసిన చీటీని సిబ్బంది గుర్తించారు. విమానంలో 192 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
చెన్నైలో విమానాన్ని ప్రత్యేక బేకు తరలించి ప్రయాణికులను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ తనిఖీల్లో బెదిరింపు వదంతిగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

