Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:10 AM ఆసిఫాబాద్General
కేబీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద - Udayam
ఆసిఫాబాద్‌ మండలంలోని కేబీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 238.20 మీటర్లు, నిల్వ 6.137 టీఎంసీలుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 5,579 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో లేదు. డ్యామ్‌ వద్ద మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షాలు కొనసాగితే గురువారం మధ్యాహ్నం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...