వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మంజూరైన 7,367 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 2,834 ఇండ్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని నిర్దేశిత ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు.
నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచడంతో పాటు, ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తూ, లబ్ధిదారులకు నిధులు సకాలంలో అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

