Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల సంతలతో రూ.3.24 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:14 AM అనంతపురంGeneral
పశువుల సంతలతో రూ.3.24 లక్షల ఆదాయం - Udayam
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ వారం నిర్వహించిన పశువుల సంతల ద్వారా రూ.3.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఛైర్‌పర్సన్‌ బల్లా పల్లవి తెలిపారు. పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.80 లక్షలు, ఆదివారం గేదెలు, ఎద్దుల సంతతో రూ.1.44 లక్షల ఫీజు వసూలైనట్లు పేర్కొన్నారు. ఫీజు వసూళ్లను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...