వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను రద్దు చేయాలని యుటిఎఫ్ చిత్తూరు జిల్లా నాయకత్వం డీఈఓ కె. లక్ష్మీనారాయణను కోరింది. ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. 20–30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులకు టెట్ నిబంధన ఇబ్బందికరంగా మారిందని రాష్ట్ర కార్యదర్శి జి.వి. రమణ, జిల్లా నాయకులు కే. రెడ్డప్ప నాయుడు, ఎన్. మణిగండన్ తెలిపారు.
పరిష్కారం కాకపోతే ఆగస్టు 14 నుంచి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

