Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
రూప దేవి Aug 06, 2026 7:11 PM జోగులాంబ గద్వాల్ General
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం - Udayam
ఎస్‌బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా తారాపురంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. శిశువు పుట్టిన గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు అందించడం మంచిదని వైద్యురాలు ఇందు మైత్రి తెలిపారు. రెండేళ్ల వరకు ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం బాలింతలకు పోషక విలువలతో కూడిన రాగి పొడిని పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...