Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లలోకి.. రోడ్డుపైకి పోటెత్తిన వరద నీరు

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:58 AM శ్రీకాకుళంGeneral
ఇళ్లలోకి.. రోడ్డుపైకి పోటెత్తిన వరద నీరు - Udayam
సరుబుజ్జిలి మండల కేంద్రానికి సమీపంలో అమృతలింగానగరం అలికాం-బత్తిలి రోడ్డు పైనుంచి రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. తుఫాను వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో ఉన్న కొండల నుంచి వర్షం నీరు వచ్చి చేరిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొండపై నుంచి వచ్చిన వర్షం నీరు వెళ్లేందుకు ఉన్న కల్వర్టులను కప్పివేయడం వలన ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...