Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో అక్రమ అబార్షన్ కిట్లు స్వాధీనం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 5:28 PM నల్గొండGeneral
నల్గొండలో అక్రమ అబార్షన్ కిట్లు స్వాధీనం - Udayam
నల్గొండలోని ఓ హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో కొనుగోలు బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన 113 ఎంటీపీ (అబార్షన్) కిట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విక్రయించేందుకు ఈ కిట్లను నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని డీసీఏ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...