Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై కొత్తగా కొనేవన్నీ ఏసీ బస్సులే: చంద్రబాబు

Follow Udayam on Google
Ram Sep 09, 2026 6:57 PM జాతీయంGeneral
ఇకపై కొత్తగా కొనేవన్నీ ఏసీ బస్సులే: చంద్రబాబు - Udayam
కోనసీమ జిల్లాలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీపై కీలక ప్రకటన చేశారు. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఏసీ బస్సులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులను దశలవారీగా ఆధునిక ఏసీ బస్సులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...