వార్తలకు తిరిగి వెళ్లండి
ఐఐటీ గువాహటిలో బీటెక్ విద్యార్థి మృతి. పోలీసుల దర్యాప్తు

ఐఐటీ గువాహటి క్యాంపస్‌లో మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థి రితేశ్ రాజ్ సింగ్ మృతిచెందాడు. క్యాంపస్‌లోని ఓ భవనం పై అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పుకార్లను నమ్మవద్దని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలకు తావివ్వొద్దని ఐఐటీ గువాహటి అధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...