వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎస్-95 పెన్షనర్లకు కనీస నెలవారీ పింఛనును రూ.7,500కు పెంచాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ బిజ్జం అశోక్ రెడ్డి, కో-కన్వీనర్ పి. లీలా కృష్ణ యాదవ్ ఈ మేరకు కోరారు.
పింఛనుతో పాటు డీఏ, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 19న ఢిల్లీలో జరిగే ఈపీఎఫ్ఓ సమావేశంలో పెన్షనర్లకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

