Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 27న చివరి సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 3:05 PM అనంతపురంGeneral
ఈనెల 27న చివరి సర్వసభ్య సమావేశం - Udayam
ఈనెల 27న జిల్లా ప్రజాపరిషత్తు చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సీఈవో విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం వచ్చే నెల 24తో ముగియనుంది. జడ్పీ ఛైర్‌పర్సన్ బి.గిరిజమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...