Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 20న పామిడిలో ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
Mohammad Sep 19, 2026 11:52 AM అనంతపురంGeneral
ఈనెల 20న పామిడిలో ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
పామిడిలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఈ నెల 20న బెంగుళూరు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభమవుతుంద న్నారు. శిబిరానికి వచ్చేవారు రెండు ఆధార్ కార్డు జిరాక్సు కాపీలతోపాటు, రెండు పాస్ ఫొటోలు తీసుకు రావాలన్నారు.

Comments

G
Loading comments...