Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-పంట నమోదుపై రైతులకు AO సూచన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:00 PM ప్రకాశం General
ఈ-పంట నమోదుపై రైతులకు AO సూచన - Udayam
రైతులందరూ ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పుల్లలచెరువు వ్యవసాయ విస్తరణ అధికారి మంత్రు కోటేశ్వరరావు నాయక్ శుక్రవారం తెలిపారు. ఆధార్, 1బి, పొలం పాస్‌బుక్ నకళ్లను కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రంలో అందజేయాలని సూచించారు. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరని, ఐడీ ఉంటేనే పీఎం కిసాన్, వ్యవసాయ పథకాలు అందుతాయని తెలిపారు. రైతులు రెండు రోజుల్లోగా వివరాలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...