Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 8న వికలాంగుల మహాధర్నా

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:52 PM హైదరాబాద్General
ఈ నెల 8న వికలాంగుల మహాధర్నా - Udayam
హైదరాబాద్ : ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం ఈనెల 8న ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు NPRD ప్రతినిధులు భుజంగరెడ్డి, జేర్కొని రాజు స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను చెల్లుబాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు బావర్చి హోటల్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...