Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 4న జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 9:03 AM శ్రీకాకుళంGeneral
ఈ నెల 4న జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు - Udayam
​శ్రీకాకుళం నగరం శాంతినిగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 4న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు ఉంటాయని జిల్లా అధ్యక్షుడు నక్క కృష్ణారావు గురువారం తెలిపారు. 75 కిలోల లోపు బాలురు 2006 నవంబరు 4 తర్వాత, 65 కిలోల లోపు బాలికలు 2006 నవంబరు 29 తర్వాత జన్మించి ఉండాలి. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు రావాలి. ఎంపికైన వారు మార్కాపురం పోటీల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...