వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువ శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల 28న సామూహిక ఉచిత కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ నైదాన తిరుపతి, ఆలయ ఈఓ వి.వి సూర్యనారాయణ తెలిపారు.
శుక్రవారం ఉదయం 9గంటలకు చదురుగుడి ఆలయ మండపంలో శ్రావణ మహాలక్ష్మి కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు, ప్రసాదాలు పొందాలని కోరారు.
Comments
Loading comments...

