Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 28 న ఓటర్ల జాబితాపై కలక్టరేట్లో సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 8:01 PM విజయనగరంGeneral
ఈ నెల 28 న ఓటర్ల జాబితాపై కలక్టరేట్లో సమావేశం - Udayam
విజయనగరం జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియపై ఈనెల 28న సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ. రాంసుందర్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు గోపాలకృష్ణ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సూచనలు అందించాలన్నారు.

Comments

G
Loading comments...