Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందశాతం పన్నులతో ఆదర్శ గ్రామం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 20, 2026 9:13 AM వరంగల్General
వందశాతం పన్నులతో ఆదర్శ గ్రామం - Udayam
ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామం పాతికేళ్లుగా వందశాతం పన్నులు చెల్లిస్తూ ఆదర్శంగా నిలిచింది. 2002 నాటి గ్రామసభ తీర్మానానికి కట్టుబడిన గ్రామస్థులు, సమిష్టి కృషితో జిల్లా స్థాయిలో ఆరుసార్లు ఉత్తమ పంచాయతీ పురస్కారాలను కైవసం చేసుకున్నారు. ఆధునిక సాగు విధానాలతో ఈ పల్లె ఉత్తర తెలంగాణలోనే తొలిసారి వరినాటు యంత్రాన్ని తెచ్చి విత్తన గ్రామంగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతు సాంబశివారెడ్డి సీఎం వైఎస్సార్, గవర్నర్ రోషయ్యల చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నారు.

Comments

G
Loading comments...