Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య కళ్లెదుటే గోడ కూలి భర్త దుర్మరణం

Follow Udayam on Google
సాయి తేజ Jun 26, 2026 10:12 AM హన్మకొండ General
భార్య కళ్లెదుటే గోడ కూలి భర్త దుర్మరణం - Udayam
మామునూరులో పాత ఇంటిని కూల్చే పనులు చేస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి సూర యాకయ్య (60) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆయన వెంట ఉన్న పురుషోత్తం అనే యువకుడికి గాయాలయ్యాయి. భార్య కళ్లెదుటే ఈ దుర్ఘటన జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.

Comments

G
Loading comments...