వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాలో శతచండీ రుద్ర యాగం

అమెరికాలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్ర యాగం’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మహా యాగంలో 30 మందికి పైగా రుత్వికులు పూజా కార్యక్రమాలను జరిపారు.
ఆరు రోజుల పాటు సాగే ఈ వేడుకల కోసం ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేశారు. ఈ పూజల్లో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు యాగ నిర్వహణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Loading comments...