Back to feed
మెట్రోకు భారీ ఊరట
Rohit Singh May 26, 2026 5:32 AM హైదరాబాద్ 17 views1 day ago

హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు పాత అప్పుల రీఫైనాన్సింగ్ కోసం ఐఆర్‌ఎఫ్‌సీతో రూ.13,527 కోట్ల రుణ ఒప్పందం కుదిరింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ, తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనివల్ల మెట్రోకు వడ్డీ భారం భారీగా తగ్గనుంది.
తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాలవ్యవధికి ఈ రుణం లభించింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా, ఐఆర్‌ఎఫ్‌సీకి ఈ మొత్తాన్ని త్రైమాసిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Loading comments...



