వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో జరిగిన చింతు చిన్నమ్ముడు హత్య కేసులో ఐదుగురు నిందితులను అంపోలులో ఉన్న జిల్లా జైలుకు తరలించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
గురువారం ఉదయం నిందితులు బెండి అచ్యుతరావు, కింతలి ధనలక్ష్మి, కింతలి గణేష్, బెండి లక్ష్మీనారాయణ, కింతలి మణికంఠలను కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఎస్. వాణి వీరికి 15 రోజులు పాటు రిమాండ్ విధిస్తూ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

