Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిబాబు హత్య కేసు పై సీపీ పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Sep 18, 2026 1:27 AM నిజామాబాద్General
హరిబాబు హత్య కేసు పై సీపీ పరిశీలన - Udayam
టౌన్-2 పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన సంఘటన స్థలాన్ని సీపీ పి. సాయి చైతన్య పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, ఎస్సై యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...