Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహలక్ష్మి’కి కరెంట్ భారం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 20, 2026 8:45 AM హైదరాబాద్General
గృహలక్ష్మి’కి కరెంట్ భారం - Udayam
వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత కారణంతో ఉచిత విద్యుత్తు పరిమితి 200 యూనిట్లు దాటడంతో అనేకమంది 'గృహలక్ష్మి' లబ్ధిదారులు బిల్లుల మోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, నీటి మోటార్ల వాడకం పెరగడమే ఇందుకు కారణం. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.45 లక్షల మంది ప్రయోజనం పొందుతుండగా, జూన్ నెలలో వాడకం బాగా పెరిగి వేలాది మంది అర్హత కోల్పోయారు. ఉచిత విద్యుత్ అందక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...