వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డాక్టర్స్ కాలనీ వద్ద వేగంగా వచ్చిన కారు, యూటర్న్ తీసుకుంటున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.
కారులో ప్రయాణిస్తున్న స్థిరాస్తి వ్యాపారి మధుగౌడ్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

