Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాశయాలతో రైతులకు ఆశలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 04, 2026 6:35 AM కృష్ణా జిల్లాGeneral
జలాశయాలతో రైతులకు ఆశలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఆందోళనలో ఉన్న రైతులకు జలాశయాల్లో పెరుగుతున్న నీటినిల్వలు ఊరటనిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండగా, త్వరలో 100 టీఎంసీలకు చేరే అవకాశముంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలోనూ వరద ప్రవాహం పెరగడంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.

Comments

G
Loading comments...