Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హకీంపేట్‌లో రైతుల భారీ నిరసన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 11:16 AM వికారాబాద్General
హకీంపేట్‌లో రైతుల భారీ నిరసన - Udayam
​ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ అక్రమాలపై హకీంపేట్ చౌరస్తాలో రైతులు భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ ఇందులో పాల్గొన్నారు. రైతుల వద్ద 10 ఎకరాలుంటే 2 ఎకరాలకే పరిహారమిచ్చి, మిగతా దానికి నకిలీ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై సీబీఐ లేదా విజిలెన్స్ విచారణ జరిపించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...