Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాక్సిన్‌ల నాణ్యతలో నిర్లక్ష్యం వద్దు: హెచ్‌ఈఓ

Follow Udayam on Google
జయ Aug 19, 2026 12:38 PM కామరెడ్డితెలంగాణ
వ్యాక్సిన్‌ల నాణ్యతలో నిర్లక్ష్యం వద్దు: హెచ్‌ఈఓ - Udayam
కామారెడ్డిలోని UFWCలో కోల్డ్ చైన్ పాయింట్‌ను హెచ్‌ఈఓ రవీందర్‌ పర్యవేక్షించారు. వ్యాక్సిన్‌ల నిల్వ, కోల్డ్ చైన్ పరికరాల పనితీరు, ఉష్ణోగ్రత నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వ్యాక్సిన్‌లను నిర్దేశిత ఉష్ణోగ్రతలో సురక్షితంగా నిల్వ చేయాలని సిబ్బందికి సూచించారు. కోల్డ్ చైన్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్‌ల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.

Comments

G
Loading comments...