వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూలో భాారీ వర్షాలు: నిలిచిపోయిన జాతీయ రహదారి

జమ్మూ డివిజన్‌లో వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటంతో 250 కిలోమీటర్ల పొడవైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) మూతపడింది.
తవీ, చీనాబ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి. వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Loading comments...