Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర తెలంగాణకు నేడు, రేపు భారీ వర్ష సూచన

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 28, 2026 11:50 AM హైదరాబాద్General
ఉత్తర తెలంగాణకు నేడు, రేపు భారీ వర్ష సూచన - Udayam
రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం మహబూబాబాద్‌లో గరిష్టంగా 8 సెం.మీ, జగిత్యాలలో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఆది, సోమవారాల్లో ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, మెదక్ సహా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...