Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిండ్రలో భారీ వర్షపాతం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 29, 2026 11:32 AM చిత్తూరుGeneral
నిండ్రలో భారీ వర్షపాతం - Udayam
అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి కురిసిన వర్షాలకు నిండ్ర మండలంలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు సోమవారం వెల్లడించారు. మిగిలిన మండలాల్లో నగరి 51.2, పాలసముద్రం 47.4, శాంతిపురం 24.8, గుడిపాల 23.0, కుప్పం 22.2, జీడి నెల్లూరు 19.2, చిత్తూరు రూరల్ 18.2, కార్వేటినగరం 17.6, మరియు పెనుమూరులో 10.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...