Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 3:14 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రహదారులు జలమయం - Udayam
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్‌పల్లి, రసూల్‌పుర, తార్నాక తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కుండపోత వర్షంతో పలు రహదారులు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వర్షంతో నగర ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.

Comments

G
Loading comments...