వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండిపోగా లింగంపేట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాములవాగు వంతెనపై నీరు చేరడంతో కామారెడ్డి-ఎల్లారెడ్డి మార్గంలో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వంతెన వద్ద తాత్కాలిక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

