వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, జూరాల గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,43,615 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జలాశయం నీటిమట్టం 830.70 అడుగులకు చేరగా, నీటి నిల్వ 50.2658 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఔట్‌ఫ్లో లేకపోగా, విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

