Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌-పంజాగుట్టలో గుంతలతో పరేషాన్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 4:15 PM హైదరాబాద్General
సికింద్రాబాద్‌-పంజాగుట్టలో గుంతలతో పరేషాన్ - Udayam
పంజాగుట్ట ప్రధాన రహదారిపై కేబుల్‌ లైన్‌ పనుల కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు శిథిలాలు, తారు ముక్కలతో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రాత్రివేళ సూచిక బోర్డులు, లైటింగ్‌ లేక గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. పనులు పూర్తి చేసి రోడ్డును పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...