వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ప్రాంతంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ మూడు లక్షల విత్తన బంతులను డ్రోన్ల ద్వారా వెదజల్లింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో మంగళగిరి, తాడేపల్లి పరిసర కొండల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
సుమారు 500 హెక్టార్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి వృక్ష సంరక్షణపై అవగాహన కల్పించారు. కొండలను దట్టమైన అటవీ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
