Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిపై హరీశ్‌రావు విమర్శలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 12:20 PM హైదరాబాద్General
ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిపై హరీశ్‌రావు విమర్శలు - Udayam
తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. టీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి అధికారి లేక పర్యవేక్షణ లోపించిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 184 ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సిబ్బంది సమస్యలు, మందుల లభ్యత వంటి అంశాలపై ప్రభావం పడుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. టీవీవీపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...