వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల క్షేత్రంలో మే 12వ తేదీన హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశగంగలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని ప్రకటించిన నేపథ్యంలో, అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకల సందర్భంగా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

