Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతలు స్వీకరించిన 11 రోజుల్లోనే హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్‌ హతం

Follow Udayam on Google
Ravish Kumar May 27, 2026 11:50 AM జాతీయంGeneral
బాధ్యతలు స్వీకరించిన 11 రోజుల్లోనే హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్‌ హతం - Udayam
ఇజ్రాయెల్‌పై జరిగిన 'అక్టోబరు 7' నాటి దాడుల సూత్రధారుల్లో ఒకరైన హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడిలో అంతం చేశాయి. గతంలో హమాస్ టాప్ లీడర్ హద్దాద్ మరణించడంతో, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన కేవలం 11 రోజుల్లోనే ఒడెహ్‌ హతమయ్యాడు. గాజా నగరంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. అక్టోబరు 7 నాటి మారణకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మట్టుబెడతామని ఇజ్రాయెల్ ప్రధాని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...