వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం వద్ద బుధవారం ఉదయం గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కోదాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
హైవే అధికారులు వెంటనే స్పందించి క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Comments
Loading comments...

