Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడెం వద్ద ఉత్సాహ వాతావరణంలో నిమజ్జనం

Follow Udayam on Google
P. G. Murthy Sep 25, 2026 6:01 PM మంచిర్యాలGeneral
గూడెం వద్ద ఉత్సాహ వాతావరణంలో నిమజ్జనం - Udayam
దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నది వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన సందడి కొనసాగుతోంది. మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన గణనాధుల విగ్రహాలను నిర్వాహకులు శుక్రవారం సాయంత్రం గూడెం గోదావరి వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా తుది ఏర్పాట్లను మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ తో పాటు మండల అధికారులు పర్యవేక్షించారు. ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను రంగంలోకి దించామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...