వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం దేవాలయంలో వేద పండితులు అఖండ దీప స్థాపన, వాసుదేవ పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, మంత్రపుష్పం, తదితర పూజలు నిర్వహించారు.
ఆలయ ఈవో శ్రీనివాస్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయని ఈవో వెల్లడించారు.
Comments
Loading comments...

