Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో 40 రోజులుగా పెండింగ్ లో రోడ్డు పనులు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:08 AM అనంతపురంGeneral
గుత్తిలో 40 రోజులుగా పెండింగ్ లో రోడ్డు పనులు - Udayam
గుత్తిలోని గాంధీ సర్కిల్ నుంచి నగరేశ్వర ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ 40 రోజుల క్రితం కంకర తోలినా, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. రోడ్డుపై కంకర ఉండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో రాళ్లు ఎగిరిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...