వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను అదనపు కలెక్టర్ ఎన్. రవి మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజన నాణ్యత, వంటగదిలోని సరుకులను పరిశీలించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.
Comments
Loading comments...

