వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట ఎస్సీ హాస్టల్ ఎస్సీ గురుకుల పాఠశాలలో సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. కిటికీలు లేని గదుల్లోకి కోతులు చొరబడుతూ విద్యార్థులను భయపెడుతున్నాయి. ఏడాది గడిచిన మినరల్ వాటర్ మిషన్ పనిచేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్కనే డ్రైనేజీ పేరుకుపోవడంతో దోమల బెడద, దుర్వాసన మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

